Wednesday, September 27, 2006

రవ్వ పులిహోర


కావలసినవి

సన్న నూకబియ్యం - 500గ్రా
నీళ్ళు - 1లీ
నూనె -75గ్రా
సెనగపప్పు - 20గ్రా
ఆవాలు - 5గ్రా
మినప్పప్పు - 20గ్రా
ఇంగువ - చిటికెడు
వేరుశెనగ గుళ్లు - 25గ్రా
ఎండుమిర్చి - 8
పచ్చిమిర్చి - 10
కరివేపాకు - 8రెబ్బలు
చింతపండు - 100గ్రా
పసుపు - 1టీస్పూను
ఉప్పు - తగినంత

తయారుచేసే పద్దతి

ఒక గిన్నెలో నీళ్లు ఎసరుపెట్టి, దానిలో బియ్యపురవ్వ కలిపి పొడిపొడిగా ఉడికాక స్ట్హ్హౌ మీది నుంచి కిందికి దించి, రెండు స్పూన్ల నూనె పైన పోసి, మూతపెట్టి ఉమ్మగిల్లే వరకు ఉంచవలెను.

తరువాత దీన్ని ఒక వెడల్పు పళ్లెంలో తీసి చల్లార్చవలెను.పొడిగా ఉండేలా చేతితో చిదమవలెను.

ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి కాగిన తరువాత చింతపండు తప్ప, మిగిలినవన్నీవేసి ఎర్రగా పోపు వేయించి, ఆ తరువాత చింతపండు గుజ్జు పిండి ఉడికించవలెను.

ఈ మిశ్రమాన్ని పళ్లెంలో చల్లర్చిన రవ్వపిండితో కలిపి, తగినంత ఉప్పు కలిపితే కమ్మని రుచి గల రవ్వ పులిహోర మీ కోసం...రెడీ....

2 comments:

oremuna said...

బాగు బాగు

శైలు said...

ధన్యవాదములు..కిరణ్ గారు