Friday, January 11, 2008

మినప సున్నుండలు

కావలసినవి:

మినప్పప్పు:500గ్రా
పంచదార :350గ్రా
నెయ్యి :200గ్రా
ఏలకులు :5
పిస్తా/బాదం(చిన్న ముక్కలు) :సరిపడినంత

తయారీ:

మినప్పప్పును మంచి సువాసన వచ్చేవరకు (గ్యాస్ తక్కువలో పెట్టుకొని 15 నిమిషాలు )వేయించి,కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి .
విడిగా పంచదారను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు రెంటిని బాగా కలిపి ఏలకులు,పిస్తా,బాదం పప్పులను కలిపి అందులొ వేడిచేసిన నెయ్యిని కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి.(నెయ్యి ఇష్టపడేవారు మరికాస్తా కలుపుకోవచ్చు)

అంతే... ఇప్పుడు ఘుమఘుమలాడే సున్నుండలు పండుగకి తయారు.
ఇక తినటమే తరువాయి....


సంక్రాంతి శుభాకాంక్షలు

2 comments:

ఆసా said...

abba.. intha easy ayithey..
maa aavida ee Sankrathi chesthey bavunnu

శైలు said...

ఆసా గారు..మీకు తయారీ..చాలా ఈజీ అనిపించిది కదా...ఇంక మీ శ్రీమతి కి పని ఎందుకు?..